AP No. 1 in employment: ఉపాధిలో ఏపీ నెం 1.. రూ. 4 వేల కోట్ల వేతనాలు చెల్లింపు
AP No. 1 in employment: కరోనా కాలం బయటకు ఎక్కడకు వెళ్లినా కాటేస్తుందని భయం... ఏం చేయాలి..
AP No. 1 in employment: కరోనా కాలం బయటకు ఎక్కడకు వెళ్లినా కాటేస్తుందని భయం... ఏం చేయాలి.. సొంత ఊళ్లోనే ఉండి, దొరికిన పని చేసుకుంటూ కలో గంజి తాగాలి... ప్రతి సమాన్యుడిలోని ఈ నిర్ణయమే ఏపీని నెంబర్ ఒన్ స్థానంలో నిలబెట్టింది. బయట పనులకు వెళ్లే ఆస్కారం లేక ఊళ్లో ఉన్న ఉపాధి పనులకు అందరూ వెళ్లాల్సి వచ్చింది. అందుకే గతంలో ఎన్నడూలేని విధంగా లక్షల్లో కూలీలకు పనులు కల్పించగా, వేల కోట్లలో చెల్లింపులు చేశారు. అయితే ఇంతటి అవసరమైన సమయంలో ఖాళీ లేకుండా పనులు కల్పించడం విశేషమే.
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏపీలో రానురాను కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా 14 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా పని కల్పించామని, కరోనా కష్టకాలంలో అత్యధికంగా ఉపాధి కల్పించగలిగామని ఆయన వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్‌వన్‌గా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్నారు.
కోవిద్-19 సంక్షోభ కాలంలో పని కల్పించి రూ.4 వేల కోట్ల వేతనాలు చెల్లించామని, 57 లక్షల మంది కూలీలకు పని కల్పించామని గిరిజా శంకర్ తెలిపారు. ఒక్క జూన్ నెలలోనే అత్యధికంగా 8 కోట్ల పని దినాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, నాడు – నేడు పాఠశాలల పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆస్తుల నిర్మాణంలోనూ దేశంలోనే ఏపీని నంబర్‌వన్ స్థానంలో నిలిపామని, పారదర్శకంగా వేతనాల చెల్లింపుల్లోనూ అందరికంటే ముందజలో ఉన్నామని గిరిజా శంకర్ వెల్లడించారు.