రైతులకుఎలాంటి ఇబ్బందులు లేకుండా http://www.andhragreens.com/ పేరిట ఆన్ లైన్ మార్కెటింగ్ నెట్వేర్క్ ని ప్రారంభించాం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇదే తరహాలో ఇప్పటికే కర్ణాటక , తెలంగాణలో జరుగితోందని.. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాజా పండ్లు, కూరగాయలు వినియోగదారుల ఇళ్లకే అందించడం జరుగుతుందని అన్నారు. దళారి వ్యవస్థ ఉండరాదన్న
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఉద్యాన వనశాఖ వీరితో ఒప్పందం చేసుకుందని చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యానవన పంటలు 43 లక్షల హెక్టార్లలో 305 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. కోవిడ్ ప్రాభమైన నాటి నుండి 18 లక్షల మెట్రిక్ టన్నుల మార్కెట్ చేశామని మంత్రి చెప్పారు. రాయలసీమలో అరటి ధర, ఉల్లి, బత్తాయి, క్యారట్, పసుపు, బూడిద గుమ్మడి, పూలు, మార్కెటింఫ్ శాఖ ద్వారా కొనుగోలు చేశామని అన్నారు.
ఇటు ధరలు లేని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్న మంత్రి.. కోవిడ్ వల్ల రైతులు నష్టపోకుండా అదుకున్నామని చెప్పారు. ఇక ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారభిస్తారని..విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయని.. గ్రామ సచివాలయంలో ఉండే అధికారులు ఈ కేంద్రాల్లో ఉంటారని.. ఇదొక యూనిక్ ప్రాజెక్టు అని అన్నారు. కరోనా వల్ల గుంటూరు మిర్చి మార్కెయార్డుని తాత్కాలికంగా నిలిపివేసినట్టు కన్నబాబు తెలిపారు. రైతుని రాజుగా చూడలన్నదే తమ ఉద్దేశం అన్న ఆయన రైతుల సమస్యలుంటే 1902 ,1907సమాచారం ఇవ్వాలని సూచించారు.