అల్లూరి జిల్లాకు సైబీరియా పక్షుల వలస ఫజుల్లాబాద్ గ్రామంలో సందడి

* విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది

Update: 2022-11-04 07:10 GMT

అల్లూరి జిల్లాకు సైబీరియా పక్షుల వలస ఫజుల్లాబాద్ గ్రామంలో సందడి

Siberian Birds: విదేశీ పక్షుల రాకతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామం సందడిగా మారింది. గ్రామంలోని చెట్లను సైబీరియా పక్షులు ఆవాసంగా మార్చుకున్నాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతోనే ఇవి ఇక్కడికి చేరుకుంటాయి. మధ్య ఆసియాలోని సైబీరియా కన్నా ఈ ప్రాంతంలో వేడి వాతావరణంవల్ల వీటి సంతానోత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల యేటా జులై, ఆగస్టులో వచ్చి కార్తీక మాసం చివరి వరకు ఇక్కడ ఉంటాయి. సంతానోత్పత్తి అనంతరం పిల్లలతో ఇక్కడి నుంచి స్వదేశానికి వెళ్లిపోతాయి.

ఒంటరిగా ఈ ప్రాంతానికి వచ్చే విదేశీ పక్షులు ఇక్కడ సుమారు ఐదు నెలలు పాటు ఉంటాయి. వీటిని గ్రామస్తులు అతిథుల మాదిరిగా చూసుకుంటారు. తమ తాతల కాలం నుంచి ఈ పక్షులు వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో గామంలోని పక్షులకు ఎవరయినా హాని తలపెడితే పెద్దగా పట్టించుకునే వారు కాదని యేటా గ్రామానికి వస్తుండడంతో వాటికి ఎటువంటి హాని జరగకుండా ప్రాణంగా చూసుకుంటున్నామని ఆ గ్రామస్తులు తెలిపారు.

గతంలో ఏటా రెండు వేలకు పైగా పక్షులు వచ్చేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు వెయ్యికి తగ్గిపోయిందని గ్రామస్తులంటున్నారు. ఉగాదికి వచ్చి చెట్లపై గూడు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయని వాటిని పొదిగి పిల్లలను చేసి నవంబర్ నెలాఖరులోపు వెళ్లిపోతాయంటున్నారు గ్రామస్తులు.

Tags:    

Similar News