AP Corona Cases: కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. 92 మంది మృతి
AP Corona Cases: ఏపీలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతుంది.
AP Corona Cases: ఏపీలో కరోనా రెండో దశ వ్యాప్తి కొనసాగుతుంది. రోజురోజుకు కరోన కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా.. 22,164 మందికి పాజిటివ్ నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.
తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,87,603 కేసులు నమోదవ్వగా.. మరణాలు 8,707కి పెరిగాయి. తాజాగా 8,832 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,90,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోని 637 కొవిడ్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న 6,870 ఐసీయూ బెడ్లలో 6,323 ఇప్పటికే నిండిపోయినట్లు సింఘాల్ వివరించారు.
రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండగా.. 22,265 నిండాయన్నారు. వ్యాక్సిన్ల కొరత ఉండటం వల్ల 45 ఏళ్లు మించిన వారికే వాక్సిన్ వేసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరగా.. సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ అన్నారు.