AP Corona Cases: కొత్తగా 10,413 కేసులు, 83మంది మృతి
AP Corona Cases: రోజువారీ కేసులు తగ్గుతున్నా ఆగని మరణాలు * ప్రతిరోజూ 80మందికి పైగానే కరోనాకు బలి
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నా మరణాలు మాత్రం కంట్రోల్‌లోకి రావడం లేదు. ఇప్పటికీ, 80మందికి పైగానే ప్రతిరోజూ బలైపోతున్నారు. ఈరోజు కూడా పదుల సంఖ‌్యలోనే మృత్యువాత పడ్డారు. గడిచిన 24గంటల్లో 83మంది మరణించారు. దాంతో, ఏపీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11వేల 296కి పెరిగింది. ఇక, గడిచిన 24గంటల్లో 85వేల 311 పరీక్షలు నిర్వహించగా 10వేల 413 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 33వేల 773 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఏపీ ఆస్పత్రుల్లో కరోనా మరణ మృదంగం కంటిన్యూ అవుతోంది. గత 24గంటల్లో 83మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 14మంది పశ్చిమగోదావరిలో 11మంది అనంతపురంలో 8మంది మరణించగా తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక, గుంటూరు, విజయనగరం, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనాకు బలైపోయారు. నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు మరణించారు.