మరో ప్రపంచం,మరో ప్రపంచం,మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! పదండి ముందుకు పదండి అని ఉవెత్తున లేచి గర్జించిన సింహం వలె పలికిన...కవి వర్ధంతి నేడు.ఆ కవి తన కవితలతో ఉద్యమాలకే ఉపిరిలు పోసాడు. తన కలంతో కార్మిక లోకాన్ని కదం తొక్కించాడు. ఆ కవే మన శ్రీ.శ్రీ గారు. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీ.శ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.
తను శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. వారు ఈ నాడు మన మద్య బౌతికంగా లేకున్నా, వారి రచనలు అందరి గుండెల్లో నిలిచే వున్నాయి.