Viral Video: జిమ్‌లో తగ్గాఫార్ వర్కౌట్స్ చేస్తున్న ఊసరవెల్లులు.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: కొత్తేడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు.
Viral Video: కొత్తేడాదిలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. ముఖ్యంగా జవనరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటారు. వీటిలో చాలా మందిలో కామన్‌గా కనిపించేది జిమ్‌కి వెళ్లడం. ఈ ఏడాది ఎలాగైనా జిమ్‌కి వెళ్లి, వర్కవుట్స్ చేయాలి, శరీరాన్ని స్ట్రాంగ్‌గా చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కొందరు దీనిని ఏడాదంతా కొనసాగిస్తే కొందరు మాత్రం మధ్యలోనే వదిలేస్తారు.
అయితే జిమ్ అనేది కేవలం మనుషులకే పరిమితమా జంతువులకు కాదా? అంటే.. ఎందుకు కాదని ప్రశ్నిస్తున్నాయి ఈ ఊసర వెల్లులు. తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోన్న ఓ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అని అనుకుంటున్నారు. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోలో ఇంతకీ ఏముంది.? అంతలా అట్రాక్ట్ చేస్తున్న అంశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ జిమ్‌లో ఎవరూ లేని సమయంలో రెండు ఊసర వెల్లులు ప్రవేశించాయి. అనంతరం అక్కడే పుషప్స్ చేస్తున్నట్లు ముందుకు వెనక్కి కదులుతూ కనిపించాయి. దీనంతటినీ అక్కడే ఉన్నో వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా పోస్ట్ చేశారో లేదో అలా ట్రెండ్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జవనరి నెలలో జిమ్‌లు చాలా బిజీగా ఉన్నాయి, చివరికి ఇలాంటి జీవులు కూడా వచ్చి వర్కవుట్స్ చేస్తున్నాయి అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నిజంగా ఈ ఊసరవెల్లులకు ఉన్న డెడికేషన్ మనకు ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో నిజంగానే జరిగిందా.? కొంపదీసి ఏఐ మాయ ఏం కాదు కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.