Optical illusion: ఇందులో ఒక నెంబర్ తేడాగా ఉంది.. అదేంటో కనిపెట్టగలరా?

Update: 2025-01-05 13:09 GMT

Optical illusion Photos: ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక్కోసారి అవి మన ఆలోచనలను మాత్రమే కాకుండా చూసే కళ్లను కూడా పరీక్షిస్తుంటాయి. ఇలాంటి ఫొటోలకు ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి డిమాండ్‌ ఉంటోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫొటోలకు ఎక్కడ లేని క్రేజ్ ఉంటోంది. నిత్యం నెట్టింట ఇలాంటి ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియాలో ఇలాంటి ఫొటోలను పోస్ట్‌ చేసేందుకు ప్రత్యేకంగా పేజీలను సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెటిజన్లను తికమక పెడుతోంది. మరి ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోను మీరు సాల్వ్‌ చేయగలరేమో ట్రై చేయండి. ఇంతకీ ఏంటా ఫొటో? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే '8831' అనే నెంబర్ కనిపిస్తోంది కదూ! అన్ని నెంబర్స్‌ ఒకేలా ఉన్నా ఇందులో ఒక్క నెంబర్ మాత్రం తేడాగా ఉంది. ఆ తేడాగా నెంబర్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఈ డిఫ్రెంట్ నెంబర్‌ ఏంటంటే.. '8881'. ఈ నెంబర్‌ కూడా ఇందులోనే దాగి ఉంది.

మరెందుకు ఆలస్యం. ఈ ఫొటోలో ఉన్న ఆ డిఫ్రెంట్ నెంబర్‌ను కనిపెట్టండి చూద్దాం. అయితే 10 సెకండ్లలో నెంబర్‌ను గుర్తిస్తే మీ ఐ పవర్‌ సూపర్‌ అని అర్థం. ఓసారి జాగ్రత్తగా ఫొటోను గమనించండి. సమాధానం ఇట్టే కనిపిస్తుంది. ఇంతకీ ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేశారా లేదా? ఎంత ట్రై చేసినా సమాధానం కనిపెట్టలేకపోతున్నారా? అయితే ఓసారి నిలువుగా ఉన్న మూడో లైన్‌ను జాగ్రత్తగా గమనిస్తే సమాధానం ఇట్టే దొరుకుతుంది. ఇంత చెప్పినా సాల్వ్‌ చేయలేకపోతే. ఆన్సర్‌ కోసం కింది ఫొటోను చూసేయండి. 



Tags:    

Similar News