Viral Video: స్క్విడ్‌గేమ్‌లో పవన్, ఎన్టీఆర్, చిరంజీవి.. వైరల్ అవుతోన్న వీడియో..!
Squid Game: స్క్విడ్‌గేమ్.. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్‌లో ఇదీ ఒకటి.
Squid Game: స్క్విడ్‌గేమ్.. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న వెబ్ సిరీస్‌లో ఇదీ ఒకటి. సౌత్ కొరియాకు చెందిన ఈ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2021లో వచ్చిన సీజన్ 1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా స్క్విడ్‌గేమ్ సీక్వెల్ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. సీజన్2 సైతం ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. మొదటివారంలో అత్యధికంగా 68 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా స్క్విడ్ గేమ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్క్విడ్ గేమ్‌లో చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్‌తో పాటు పలువురు నటిస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ! అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిని నిజం చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ లోని స్టార్ హీరోలు, కమెడియన్‌లను ‘స్క్విడ్‌గేమ్’ వెబ్‌సిరీస్‌లోని పాత్రల తరహాలో తయారైనట్లు సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీటిని ఓ వీడియో రూపంలో రూపొందించారు. ‘‘ఒకవేళ వీరంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘స్క్విడ్‌గేమ్’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’’ అనే క్యాప్షన్‌తో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు వైరల్ చేస్తున్నారు. స్క్విడ్ గేమ్‌లో తమ అభిమాన హీరోలు కనిపించడం బాగానే ఉంది కానీ. ఓడిపోతే జరిగేది తలుచుకుంటేనే ఏదోలా ఉంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.