Viral Video: పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి దారుణం..!

Viral Video: ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-08 05:38 GMT

Viral Video: పెళ్లి వేడుకలో ఊహించని పరిణామం.. పాపం పెళ్లి కొడుకు పరిస్థితి దారుణం..!

Viral Video: ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఉండే ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఒకేసారి చేసుకోవాలని కోరుకునే వివాహ వేడుకను ఎంతో సంబురంగా జరుపుకోవాలని అంతా అనుకుంటారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకను వీడియోలు, ఫొటోల రూపంలో బంధించాలనుకుంటారు. అయితే వెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని సంఘటనలు కొన్ని సందర్భాల్లో వైరల్‌ అవుతుంటాయి.

తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అలాంటి ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. వివాహం జరుగుతోన్న సమయంలో ఊహించని పరిణామం వరుడు పరువు పోయేలా చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో ప్రకారం ఓ మండపంలో వివాహ వేడుక జరుగుతోంది. పెళ్లి ఆచారంలో భాగంగా వధూవరులిద్దరూ ఏడడుగులు వేస్తున్నారు.

ఇక రౌండ్ భాగానే వేశారు. ఆ తర్వాతే వరుడి లుంగీ జారీ కింద పడిపోయింది. చుట్టు పక్కల ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీంతో వెంటనే అలెర్ట్‌ అయిన వరుడు లుంగి తీసి మళ్‌లీ కట్టుకున్నాడు. అయితే అప్పటికే అదంతా అక్కడున్న వారి ఫోన్‌లలో రికార్డ్‌ అయ్యింది. ఇంకేముంది ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట తెగ ట్రెండ్‌ అయ్యింది. ఇలా పోస్ట్‌ చేశారో లేదో ట్విట్టర్‌ వేదికగా తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. పాపం పెళ్లి కొడుకు ఇలా జరుగుతుందని అస్సలు ఊహించకపోవచ్చు అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే.. ఏంటి బ్రో మొలతాడు పెట్టుకుంటే సరిపోయేది కదా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Tags:    

Similar News