Optical Illusion: మీ బ్రెయిన్‌కు ఓ పరీక్ష.. ఈ ఫొటోలో ఉన్న 3 తప్పులు కనిపెట్టండి చూద్దాం..!
Photo Puzzle: ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వీటిని సాల్వ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Photo Puzzle: ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు వీటిని సాల్వ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఒకప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్ న్యూస్ పేపర్స్‌లో సండే మ్యాగజైన్స్‌లో ప్రింట్ అయ్యేవి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ వేదికగా ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పై కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ఓ వ్యక్తి కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో మొత్తం మూడు మిస్టేక్స్ ఉన్నాయి. అవేంటో గుర్తు పట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం.
అయితే కేవలం 10 సెకండ్లలో మూడు తప్పులను గుర్తిస్తే మీ బ్రెయిన్ షార్ప్ అని అర్థం. ఇంతకీ ఆ మూడు తప్పులను కనిపెట్టారా లేదా.? ఓసారి తీక్షణంగా గమనిస్తే పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరెందుకు ఆలస్యం ఓ సారి గమనించండి. అయితే ఈ పజిల్‌ను సాల్వ్ చేయాలంటే కేవలం మీ కంటి చూపు మాత్రమే కాదు మీ ఆలోచన శక్తి కూడా ఉండాలి. అయితే అయితేనే ఆ తప్పులు సాల్వ్ చేయగలరు.
ఇంతకీ పజిల్‌ను సాల్వ్ చేశారా.? లేదా.? ఎంత ట్రై చేసినా పజిల్ సాల్వ్ చేయలేకపోతున్నారా.? ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న ఆ మూడు తప్పులు ఏంటంటే. ఒకటి.. గోడకు తగిలించి ఉన్నపురాతన ఫొటోలో మోడ్రన్ కారు ఉండడం. రెండోది.. అరటి పండును చెవిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇక మూడో తప్పు విషయానికొస్తే కాళ్లకు రెండు వేర్వేరు రకాల బూట్లు వేసుకున్నాడు. ఇదండీ ఈ ఫొటో పజిల్ సారాంశం.