Viral Video: గాలిపటం ఎగరవేస్తున్న కోతి.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..!

Viral Video: సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది గాలిపటం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ గాలిపటాలను ఎగరవేసేందుకు ఇష్టపడుతుంటారు.

Update: 2025-01-07 07:37 GMT

Viral Video: గాలిపటం ఎగరవేస్తున్న కోతి.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో..!

Viral Video: సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది గాలిపటం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ గాలిపటాలను ఎగరవేసేందుకు ఇష్టపడుతుంటారు. సెలవులు వచ్చాయంటే చాలు మేడలపైకి ఎక్కి గాలిపటాలతో సందడి చేస్తుంటారు. అయితే ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితమా అంటే కాదని చెబుతోంది ఓ వీడియో. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

గాలిపటాలను మనుషులు ఎగరవేస్తుంటారు. అయితే తానేం తక్కువ తిన్నా అనుకుందో ఏమో కానీ ఓ శునకం ఎంచక్కా మేడపైకి ఎక్కింది. అచ్చంగా మనుషుల్లాగే దారాన్ని పట్టుకుని గాలిపటం ఎగరవేసింది. ఓవైపు గాలిపటం గాలిలో ఎగురుతూనే ఉంది మరో వైపు కోతి దారాన్ని పట్టుకొని లాగుతుంది. నిజానికి ఆ గాలిపటాన్ని ఎవరో ఎరగవేశారు. అయితే ఆ దారం తెగి పడిపోవడంతో అది కాస్త కోతి చేతికి చిక్కింది.

దీంతో దారాన్ని పట్టుకున్న కోతి అచ్చంగా మనిషిలాగే గాలిపటాన్ని ఎగరవేసింది. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. కానీ నెట్టింట వీడియో ట్రెండ్ అవుతోంది. బెనారస్‌లో జరిగిందంటూ ట్విట్టర్‌ వేదికగా ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ కోతి నిజంగానే మనుషులను మించి పోయిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దారాన్ని చివరి వరకు లాగిన కోతి గాలిపటాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Tags:    

Similar News