Photo Puzzle: ఈ ఫొటోలో 3 తప్పులు ఉన్నాయి.. అవేంటో కనిపెట్టగలరా?

Update: 2025-01-04 13:40 GMT

Photo Puzzle: సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వాటిలో ఫొటో పజిల్స్‌ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇలాంటి ఫొటోల్లో కొన్ని మన ఆలోచనకు పదును పెడితే. మరికొన్ని కంటి చూపును పరీక్షిస్తుంటాయి. కొన్ని రకాల ఫొటోలైతే రెండింటికీ ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి ఫొటోలే ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో, అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన కనిపిస్తున్న ఫొటోను చూడగానే కొందరు ప్రయాణికులు ఏదో వాహనంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే ఈ ఫొటోలో మూడు తప్పులు ఉన్నాయి. అవెంటో కనిపెట్టారా? ఈ తప్పులను కేవలం 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐ పవర్‌తో పాటు ఆలోచన శక్తి సూపర్‌ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ మూడు తప్పులు ఏంటో కనిపెట్టారా? ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే కనిపెట్టడం అంత కష్టమైన విషయమేమీ కాదు.

ఈ ఫొటో మీ ఆలోచనా నైపుణ్యాలను పరీక్షిస్తోంది. బస్సులో కొందరు ప్రయాణికులు వెళ్తున్నారు. అదే సమయంలో బస్సు ముందు కొన్ని వాహనాలు వెళ్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో ఉన్న మూడు ఫొటోలను కనిపెట్టవచ్చు. ఓసారి ఫొటోను జాగ్రత్తగా గమనించండి. ఈ ఫొటోలో మీకు మొత్తం మూడు తప్పులు కనిపిస్తాయి. ఎంత ప్రయత్నించినా తప్పులను కనిపెట్టలేకపోతున్నారా? అయితే సమాధానాల కోసం ఇక్కడ చూడండి.


ఈ తప్పుల్లో ఒకటి వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి పేపర్‌ను రివర్స్‌లో చూస్తున్నారు. అదే విధంగా డ్రైవింగ్‌ సీట్‌లో డ్రైవర్‌ లేడు. ఇక మూడో తప్పు విషయానికొస్తే వర్షం పడకున్నా వైపర్స్‌ ఆన్‌లోనే ఉన్నాయి. ఇవే ఈ ఫొటోలో ఉన్న మూడు తప్పులు. 

Tags:    

Similar News