Viral Video: ఫెరారీకి దిక్కైన ఎడ్ల బండి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: ఒకప్పుడు ప్రయాణం అంటే ఎడ్ల బండిపైనే చేసేవారు. ఎంత దూరమైనా ఎడ్ల బండిపైనే ప్రయాణం చేసేవారు.

Update: 2025-01-02 11:37 GMT

Viral Video: ఫెరారీకి దిక్కైన ఎడ్ల బండి.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: ఒకప్పుడు ప్రయాణం అంటే ఎడ్ల బండిపైనే చేసేవారు. ఎంత దూరమైనా ఎడ్ల బండిపైనే ప్రయాణం చేసేవారు. అయితే ప్రస్తుతం అధునాతన కార్లు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది రూపాయలతో కూడా లగ్జరీ కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఎన్ని కోట్ల విలువైన కారు అయినా సరే మొరాయించడం సర్వసాధారణమైన విషయం. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఎడ్ల బండి పవర్‌ ఏంటో చెప్పకనే చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రేవ్‌దండా బీచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబైకి చెందిన టూరిస్టులు ఖరీదైన ఫెరారీ కారులో బీచ్‌కు వచ్చారు. ఇసుకలో కారును నడిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. దీంతో ఎంత ప్రయత్నించినా కారు మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో అక్కడే ఉన్న పర్యాటకులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఎంత ప్రయత్నించినా కారు మాత్రం ఇసుకలో నుంచి బయటకు రాలేదు.

దీంతో చేసేది ఏం లేక ఎడ్ల బండిని ఆశ్రయించారు. అక్కడే ఉన్న ఓ ఎద్దుల బండి యజమాని అక్కడికి వచ్చాడు. కారుకు తాడు కట్టి ఎద్దుల బండితో లాగేందుకు ప్రయత్నించారు. తాడు కట్టగానే ఎద్దులను అదిలించడగా.. ఇసుకలో కూరుకుపోయిన కారు నెమ్మదిగా బయటకు వచ్చింది. అలా అలా ముందుకు రావడంతో కారు రయ్యిమని దూసుకుపోయింది. ఇదంతా అక్కడా ఉన్న కొందరు వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఫెరారీ కారుకు చివరికి ఎడ్ల బండే దిక్కైంది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఎవరి విలువైన సరైన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 


Tags:    

Similar News