Viral Video: బ్రెడ్‌ ముక్కలతో ఇదేం పని.. ఉర్ఫిని మించి పోయేలా ఉన్నావే..!

Viral Video: సోషల్‌ మీడియా గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఉర్ఫి జావేద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Update: 2024-12-31 05:13 GMT

Viral Video: బ్రెడ్‌ ముక్కలతో ఇదేం పని.. ఉర్ఫిని మించి పోయేలా ఉన్నావే..!

Viral Video: సోషల్‌ మీడియా గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఉర్ఫి జావేద్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిత్రవిచిత్రమైన డ్రస్‌లు ధరిస్తూ నెట్టింట ఉర్ఫి చేసే హంగామా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్‌ డ్రస్‌లో హంగామా చేస్తుంటుంది. ముంబయి వీధుల్లో ఉర్ఫి హంగామా మాములుగా ఉండదు. నిత్యం సోషల్‌ మీడియాలో ఉర్ఫి జావేద్‌ చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది.

ఇదిలా ఉంటే ఉర్ఫిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో కానీ ఓ మహిళ కూడా ఇలాంటి పని చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ విచిత్రమైన డ్రస్‌ను ధరించి రచ్చ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సోన్‌పాల్‌ అనే ఇన్‌స్ట్రాగ్‌ ఐడీలో ఓ మహిళ రకరాల విన్యాసాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళ బ్రెడ్‌ ముక్కలన్నింటీతో డ్రస్‌ ధరించింది. బ్రెడ్‌ ముక్కలను దారం సహాయంతో ఒక దాంతో మరొకటి జోడించి అచ్చంగా డ్రస్‌లా తయారు చేసి ధరించింది. అనంతరం వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ అమ్మాయి ఎవరో ఉర్ఫిని స్ఫూర్తిగా తీసుకుందని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. 


Tags:    

Similar News