Photo Puzzle: మీరు తెలివైన వారా.? ఈ ఫొటోలో తప్పును కనిపెట్టండి చూద్దాం..!
Photo Puzzle: ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో పజిల్స్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి వాటికి భారీగా డిమాండ్ పెరిగింది.
Photo Puzzle: ఆప్టికల్ ఇల్యూజన్, ఫొటో పజిల్స్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా మన మెంటల్ ఎబిలిటీని టెస్ట్ చేసే ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫోటో నెటిజన్లను తికమక పెడుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ప్రకృతి రమణీయత నడుమ, ఓ బ్రిడ్జిపై ఓ కపుల్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది కదూ! ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కనిపిస్తున్న ఈ ఫొటోలో ఓ మిస్టేక్ దాగి ఉంది. ఆ తప్పును కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ముఖ్య ఉద్దేశం. మరెందుకు ఆలస్యం ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్‌ను కనిపెట్టండి చూద్దాం.
అయితే ఈ తప్పును కేవలం 10 సెకండ్లలో కనిపెట్టాలి. అలా అయితేనే మీ బ్రెయిన్ షార్ప్ అని అర్థం. కేవలం మీ ఆలోచన శక్తికి మాత్రమే కాకుండా కంటి చూపును కూడా ఈ ఫొటో పరీక్షిస్తోంది. ఇంతకీ ఈ ఫొటోలో ఉన్న తప్పును కనిపెట్టారా లేదా.? అయితే ఓసారి అక్కడి నీటి ప్రవాహాన్ని గమనిస్తే సమాధానం మీకే తెలిసిపోతుంది. బ్రిడ్జికి ఒకవైపు నీరు అత్యంత వేగంగా ప్రవహిస్తోంది కదూ! అయితే బ్రిడ్జికి మరోవైపు మాత్రం నీటి చుక్కలేదు. ఇదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్. అటువైపు నుంచి నీరు వస్తున్నప్పుడు భూమి ఎలా ఉంటుంది. ఇదేనండి ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్. చూశారుగా ఈ ఫొటో పజిల్‌ను భలే ఉంది కదూ! మరెందుకు ఆలస్యం ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కు కూడా పంపించి సాల్వ్ చేయగలరేమో ఛాలెంజ్ విసరండి.