Viral Video: మద్యం మత్తులో మందు బాబు హల్చల్.. విద్యుత్ తీగలపైనే విన్యాసాలు

Viral Video of a man sleeping on Electric wires in Andhra Pradesh: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ తీగలపై పడుకున్న ఘటన ఇది. విద్యుత్ స్తంభం పైకి ఎక్కిన ఆ వ్యక్తి నులక మంచంపై పడుకున్నంత తాపీగా విద్యుత్ తీగలపై పడుకున్నాడు.

Update: 2025-01-01 15:42 GMT

Viral Video of a man sleeping on Electric wires in Andhra Pradesh: మద్యం మత్తులో ఓ వ్యక్తి విద్యుత్ తీగలపై పడుకున్న ఘటన ఇది. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. ఎం. సింగిపురం గ్రామస్థులను ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఉరుకులు పరుగులు పెట్టించాడు.

మద్యం మత్తులో ఆ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కడం చూసి గ్రామస్తులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. స్తంభం ఎక్కవద్దని గట్టిగా కేకలు వేస్తూ అతడిని వారించారు. కానీ మద్యం మత్తులో ఉండటంతో అతడు వారి మాటలు చెవికి ఎక్కించుకోలేదు. ఎవ్వరి మాట వినకుండా నేరుగా స్తంభంపైకి ఎక్కాడు. అది చూసి అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే స్థానిక సబ్ స్టేషన్‌కు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చే విద్యుత్ సరఫరా నిలిపేయాల్సిందిగా చెప్పారు.

గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా ఆపేశారు. అప్పటికే విద్యుత్ స్తంభం పైకి ఎక్కిన ఆ వ్యక్తి నులక మంచంపై పడుకున్నంత తాపీగా విద్యుత్ తీగలపై పడుకున్నాడు. కింద నుండి గ్రామస్తులు ఎన్ని కేకలు వేసినా పట్టించుకోకుండా కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి అతికష్టంమీద అతడిని కిందికి తీసుకొచ్చేటప్పటికి వారికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది.

గ్రామస్తులు ఈ ఘటనను మొబైల్ కెమెరాలతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్... "మందుకు ఉన్న పవర్ అలాంటిది మరి" అని కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 31న మద్యం ప్రియులు మందు తాగుతారని తెలుసు కానీ మరీ ఈ రేంజులో తాగుతారని అనుకోలేదని ఇంకొంతమంది నెటిజెన్స్ మందుబాబులపై సెటైర్స్ (Jokes on drunkards) వేస్తున్నారు.

Tags:    

Similar News