Viral Video: రోడ్డుపై కొత్త జంట వింత ప్రవర్తన.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: సోషల్‌ మీడియా పుణ్యామాని ఎక్కడ లేని వింతలు చూడాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.

Update: 2024-12-31 09:03 GMT

Viral Video: రోడ్డుపై కొత్త జంట వింత ప్రవర్తన.. వైరల్‌ అవుతోన్న వీడియో..!

Viral Video: సోషల్‌ మీడియా పుణ్యామాని ఎక్కడ లేని వింతలు చూడాల్సి వస్తుంది. ప్రతీ ఒక్కరూ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే అందరు చేసినట్లు చేస్తే స్పెషాలిటీ ఏముంటుందని అనుకుంటున్నారో ఏమో కానీ. రకరకాల ఫీట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ప్రస్తుతం పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్ పేరుతో కొత్త జంటలు చేస్తున్న సందడి చూస్తుంటే ఒకింత ఆశ్చర్యంతో పాటు కొంత వికారం కూడా కలుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌కి అర్థాన్నే మార్చేస్తున్నారు కొందరు కపుల్స్‌. రకరకాల విన్యాసాలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా పెళ్లైన ఓ కొత్త జంట చేసిన పనికి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఓ బిజీ రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. రోడ్డంతా బిజీబిజీగా ఉంది. అంతలోనే ఓ కొత్త జంట రోడ్డుపై ప్రత్యక్షమైంది. వరుడు వదువును ఓ రిక్షాబండిపై కూర్చొబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. కాసేపటికే ఓ రిక్షాను తొక్కుతూ పెళ్లి కూతురును ఎక్కించుకున్నాడు. ఇదంతా దూరంగా ఎక్కడి నుంచో కెమెరాలో బంధించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూడగానే అసలు విషయం ఏంటో అర్థం కాలేదు. అయితే కాసేపు గమనించిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఇదేదో కావాలనే చేశారని. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశం తప్ప ఇందులో ఏముంది చెప్పండి అంటూ కొందరు స్పందిస్తుంటే. ఇలాగే పోతే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. 


Tags:    

Similar News