Viral Video: అచ్చం మనుషుల్లాగే స్నానం చేస్తున్న ఎలుక.. వైరల్ అవుతోన్న వీడియో..!
Viral Video: సోషల్ మీడియా పుణ్యామాని ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
Viral Video: సోషల్ మీడియా పుణ్యామాని ఎక్కడ ఏ వింత సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కాస్త భిన్నంగా ఉన్న ప్రతీ వీడియో నెటిజన్లను పలకరిస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి సంఘటనలు జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. తాజాలా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
సాధారణంగా సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అసాధారణంగా ప్రవర్తించే జంతువుల వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాములు, ఎలుకలు, పులులు ఇలా రకరకాల జంతవులు చేసే పనులకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తాజాగా ఓ ఎలుక వెరైటీ పని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అచ్చంగా మనిషిలాగే స్నానం చేసిందా ఎలుక.
ఎలుక స్నానం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! అయితే ఇది నిజంగా జరిగింది. ఓ ఎలుక స్వయంగా తనకు తాను శరీరమంతా సబ్బు రాసుకొని స్నానం చేసింది. అచ్చంగా మనిషిలాగే వీపు భాగంలో కూడా సబ్బు రుద్దుకుంది. ఎలుకలు ఇలా చేయడం నిజంగానే అరుదైన విషయంగా చెప్పొచ్చు. దీనతంటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటూ ముక్కు వేలేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ వీడియో నిజంగానే జరిగిందా.? లేదా ఏదైనా ఏఐ మహిమ అయితే కాదు కదా అంటూ స్పందించగా మరికొందరు మాత్రం ఈ ఎలుకకు ఎవరో బాగా ట్రైనింగ్ ఇచ్చారంటూ స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.