Actress: ఈ ఫొటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇంటర్‌ పాస్‌ కాలేదు కానీ ఇండస్ట్రీని ఏలుతోంది..!

Actress: చదువుకు సక్సెస్‌కు సంబంధం లేదని ఎంతో మంది నిరూపించారు.

Update: 2025-01-09 07:01 GMT

Actress: ఈ ఫొటోలో చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇంటర్‌ పాస్‌ కాలేదు కానీ ఇండస్ట్రీని ఏలుతోంది..!

Actress: చదువుకు సక్సెస్‌కు సంబంధం లేదని ఎంతో మంది నిరూపించారు. చదువులో రాణించలేకపోయినా తమ, తమ రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అందుకున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారు కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఇంతకీ ఈ చిన్నరి ఎవరో గుర్తుపట్టారా.? ఈ బ్యూటీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. కోట్ల రెమ్యునరేషన్‌ను తీసుకుంటోంది.

నిజానికి ఈ బ్యూటీ ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యింది. అయితే కెరీర్‌లో మాత్రం రాణిస్తోంది. ప్రస్తుతం సినిమాకు ఏకంగా రూ. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటూ అందరినీ అబ్బురపరుస్తోంది. ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార అలియాభట్‌. స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన యాక్టింగ్‌తో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ బ్యూటీ.

గంగుభాయ్ కతియావాడి సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించింది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఏకంగా నేషనల్‌ అవార్డును సొంతం చేసుకుందీ చిన్నది. తెలుగులోనూ ప్రేక్షకులను మెప్పించిందీ బ్యూటీ. ట్రిపులార్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సీతా పాత్రలో ఉన్న కాసేపైనా అద్భుత నటనను కనబరించింది. ఈ సినిమా కోసం అలియా భట్‌ ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుందని వార్తలు వచ్చాయి.

అయితే ట్రిపులార్‌ మూవీకి అలియా కేవలం 10 రోజుల మాత్రమే పనిచేసింది. అంటే అలియా ఏకంగా రోజుకు కోటి రూపాయలు తీసుకుందన్నమాట. అలియా కెరీర్‌ విషయానికొస్తే చివరిసారిగా జిగ్రా మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిఇందే. ఈ సినిమాను తెలుగులోనూ పెద్ద ఎత్తున విడుదల చేశారు. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. ఇక ప్రస్తుతం అలియా చేతిలో ఆల్ఫా సినిమాతో పాటు.. లవ్ అండ్ వార్ సినిమా ఉన్నాయి.


Tags:    

Similar News