Viral Video: తెలివి తెల్లారినట్లే ఉంది.. డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారో చూడండి..!
Viral Video: ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Viral Video: ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడిపించే వారి వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో తెలిసిందే. తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెడుతుంటారు మద్యం బాబులు. ఫుల్లుగా మందు తాగి రోడ్లపై వాహనాలను నడిపిస్తుంటారు.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లను నిర్వహిస్తుంటారు. టెస్టుల్లో పట్టుబడడ్డ వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష సైతం విధిస్తుంటారు. అయితే డ్రంక్ డ్రైవ్ నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు మందు బాబులు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఈ విన్యాసాలకు పీక్స్‌లా కనిపించడం ఖాయం.
వివరాల్లోకి వెళితే.. కొందరు యువకులు బార్‌లో ఫుల్‌గా మందుకొట్టారు. ఆ తర్వాత బార్ నుంచి తూలుతూనే బయటకు వచ్చారు. బార్ ముందు పార్క్ చేసి ఉన్న కారును అక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. మాములుగా కార్ ఆన్ చేసుకొని వెళ్తే అది వార్త ఎలా అవుతుంది.? కానీ ఆ యువకులు మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని అనుకున్నారో ఏమో గానీ.. చివరకు విచిత్ర నిర్ణయం తీసుకున్నారు.
అంతా కలిసి కారు చుట్టూ చేరి చేతులతో పైకి ఎత్తారు. కారును అలాగే మోస్తూ రోడ్డుపై నడచుకుంటూ వెళ్లారు. మధ్యలో ఓ టోల్‌గేట్‌ను కూడా దాటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఎంత వరకు నిజం ఉందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదేదో యానిమేషన్ వీడియోలాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. యానిమేటెడ్ వీడియో అయినా నవ్వించేలా ఉందీ వీడియో. మరెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు చూసేయండి.