Actress: చిరుత హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అంతే..!

Actress: రామ్‌ చరణ్‌ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రం 'చిరుత'. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

Update: 2025-01-10 10:25 GMT

Actress: చిరుత హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అంతే..!

Actress: రామ్‌ చరణ్‌ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రం 'చిరుత'. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. చిరంజీవి నట వారసత్వం ఉన్నా చెర్రీ ఈ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. తొలి మూవీతోనే నటుడిగా మంచి మార్కులు వేశాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ అద్బుత దర్శకత్వం, రామ్‌ చరణ్‌ నటన సినిమాకు విజయాన్ని అందించిందని చెప్పాలి.

ఈ సినిమా చెర్రీ యాక్షన్‌, డ్యాన్స్‌తో అభిమానులను ఫిదా చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చెర్రీకి జోడిగా నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది. పొగరున్న అమ్మాయి పాత్రలో నెహా శర్మ మంచి నటనను కనబరించింది. నేహా శర్మకు కూడా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది.

ఇక ఈ సినిమా తర్వాత నేహా.. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమా తర్వాత నేహా తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమాల్లో నటించలేదు. తేరీ మేరీ కహానీ’ సినిమాతో హిందీలో నటించింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ మూవీస్‌లో బోల్డ్‌ పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక తాజాగా నాని, మృణాళ్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమాలో స్పెషల్‌ రోల్‌లో నటించింది.

ఈ ఏడాది విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్‌ లోనూ ఓ స్పెషల్ రోల్ లో మెరిసింది. అలాగే 36 డేస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. గతంతో పోల్చితే సినిమాలను తగ్గించిన నేహా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్‌ ఫొటోలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోందీ చిన్నది. తాజాగా నేహా శర్మకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.


Tags:    

Similar News