Viral Video: ఎలా వస్తాయి గురూ ఇలాంటి ఐడియాలు.. కొబ్బరి చెట్టును టవర్‌గా మార్చేశారు.. వైరల్‌ వీడియో..!

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి వచ్చేస్తున్నాయి.

Update: 2025-01-15 09:33 GMT

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ఎన్నో వింతలు విశేషాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రోటీన్‌కు కాస్త భిన్నంగా ఉంటే చాలు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో..? అందులో అంతలా ఏముందన్న విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

సాధారణంగా సెల్‌ ఫోన్‌ టవర్స్‌ ఐరన్‌తో తయారు చేస్తారని తెలిసిందే. పొడవాటి ఐరన్ టవర్స్‌పై సిగ్నల్స్‌ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే కొబ్బరి చెట్టుపై సిగ్నల్స్‌ వచ్చే సెటప్‌ ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ! అయితే భారత్‌లో అన్నీ సాధ్యమే అన్నట్లు దీనిని నిజం చేసి చూపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని గమనించాడు.

వెంటనే తన జేబులో నుంచి స్మార్ట్‌ ఫోన్‌ తీసి వీడియో చిత్రీకరించాడు. విజయ్‌ అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఈ విచిత్రమైన సంఘటన గుర్గావ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కొబ్బరి చెట్టుపై నెట్‌వర్క్‌ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలా చెట్లపై టవర్‌ను ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నివసించే వారికి ప్రమాదం పొంచి ఉండడం ఖాయమని అంటున్నారు.

మరికొందరు స్పందిస్తూ.. `సైబర్ సిటీ అంటే ఇదేనేమో`, ఏది ఏమైనా ఈ తెలివికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే అక్కడ టవర్‌ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. టవర్‌కు సమాంతరంగా చెట్టు పెరిగిందా.? లేదా చెట్టు ఉన్న చోటనే టవర్‌ చేశారా అన్న అనుమానం కలుగుతోంది. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ క్రేజీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.


Tags:    

Similar News