Viral Video: గర్ల్‌ ఫ్రెండ్ లేని లోటును తీరుస్తుంది.. ధర కేవలం కోటిన్నర మాత్రమే..!

Viral Video: రోబోటిక్స్‌ రంగం రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. అధునాతన టెక్నాలజీతో రోబోలు మనుషులను మించే రోజులు వచ్చేస్తున్నాయి.

Update: 2025-01-13 06:03 GMT

Viral Video: గర్ల్‌ ఫ్రెండ్ లేని లోటును తీరుస్తుంది.. ధర కేవలం కోటిన్నర మాత్రమే..!

Viral Video: రోబోటిక్స్‌ రంగం రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. అధునాతన టెక్నాలజీతో రోబోలు మనుషులను మించే రోజులు వచ్చేస్తున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయి. మనిషి ఊహను మించి రోబోలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం పని ప్రదేశాల్లో ఉండే మనుషులను మాత్రమే రోబోలు రీప్లేస్ చేయనునున్నాయని అంతా భావించారు.

అయితే మానవ బంధాలను సైతం రోబోలు రీప్లేస్‌ చేసే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. కొన్ని ఆవిష్కరణలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఏఐ రోబో గర్ల్‌ ఫ్రెండ్‌ను రూపొందించింది. అచ్చంగా మనిషి పోలినట్లు ఉన్న ఈ రోబో మనుషుల్లాగే భావోద్వేగాలను పంచుకుంటుంది. మనిషిని, రోబోను వేరు చేయలేనంతగా ఈ రోబో మనుషుల్లో కలిసిపోతుందని కంపెనీ చెబుతోంది.

రియల్‌ బోటిక్స్‌ అనే కంపెనీ ఈ రోబోను తయారు చేసింది. ఈ రోబో ధరను కంపెనీ రూ. 1.5 కోట్లుగా నిర్ణయించింది. పురుషుల ఒంటరితనాన్ని దూరం చేయగల సహచరిణిగా ఈ రోబో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. మరి ఇంత ధర పెట్టి ఈ రోబోను ఎవరు కొనుగోలు చేస్తారనేగా మీ సందేహం. ఇలాంటివి కొనుగోలు చేసే వారు కూడా ఉంటారండోయ్‌. లాస్‌ వెగాస్‌లో జరుగుతున్న ‘2025-కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌’ షోలో తాము అభివృద్ధి చేసిన ‘ఆరియా’ రోబో గర్ల్‌ఫ్రెండ్‌ను రియల్‌బోటిక్స్‌ ఆవిష్కరించింది.

కంపెనీ సీఈవో ఆండ్రూ కిగ్వెల్‌ మాట్లాడుతూ.. ‘పురుషుల ఒంటరితనాన్ని దూరం చేయగలిగేది, మనుషుల నుంచి వేరు చేయలేని విధంగా ఉండేలా ఓ రోబోను తీసుకురావాలనుకున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రోబోటిక్స్‌ రంగంలో ఎవ్వరూ చేయని విధంగా భావోద్వేగాలను పంచుకునే ఒక రియలిస్టిక్‌ రోబోను తయారుచేశామని, సహచరణిగా ‘ఆరియా’ కొంత మందికి మనోహరమైనది, మరికొంత మందికి భయంకరమైనదని కిగ్వెల్‌ చమత్కరించారు.


Tags:    

Similar News