Monkey Viral Video: షాపింగ్‌ మాల్‌లో కోతి గందరగోళం.. వీడియో వైరల్

Monkey shopping mall video: మాల్‌లో దూరిన కోతి అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది. యువతిని గోర్లతో గీరడం, తల లాగడం వంటివి చేసింది. పదే పదే ఆమెపై దాడి చేసింది.

Update: 2025-01-11 13:20 GMT

Monkey shopping mall video: కోతి చేష్టలు గురించి తెలిసిందే. అవి చేసే తింగరి పనులు కొన్నిసార్లు నవ్వులు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు చిరాకు తెప్పిస్తాయి. కోతులు చేసే చిత్ర విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా యూపీలోని ఝాన్సీ రాష్ట్రంలో ఓ కోతి షాపింగ్ మాల్‌లోకి దూరి హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్‌లోకి ప్రవేశించిన ఓ కోతి.. మాల్‌లోని అందరినీ పరుగులు పెట్టించింది. మాల్ అంతా కలియ తిరుగుతూ గందరగోళం సృష్టించింది. అసలే అది కోతి దాని తింగరి చేష్టలతో మాల్‌లో వారందరినీ హడతెత్తించింది. ఇక దానిని బంధించేందుకు అక్కడ ఉన్నవారంతా నానా తంటాలు పడ్డారు. కోతిని పట్టుకోవడం సిబ్బందికి ఓ సవాల్‌గా మారింది. ఇంతకీ ఆ ఏం చేసిందంటే..

మాల్‌లో దూరిన కోతి అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది. యువతిని గోర్లతో గీరడం, తల లాగడం వంటివి చేసింది. పదే పదే ఆమెపై దాడి చేసింది. ఆమె కాళ్లకున్న షూ లాగేసింది. దీంతో ఆమె కంగారుపడి కేకలు వేసింది. మాల్ అంతా తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. భయాందోళనకు గురైన సిబ్బంది, కస్టమర్లు.. కోతిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అరటిపండు ఆశ చూపారు. అయినా అది ఊరుకోలేదు. గంతులేస్తూ హంగామా చేస్తూనే ఉంది.

ఇక లాభం లేదనుకున్న సిబ్బంది దుప్పటితో దాన్ని బంధించాలని భావించారు. దాని తుంటరి చేష్టల ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ కోతి వారికి చిక్కకుండా మాల్‌లోని స్టాండ్‌లపై తిరుగుతూ గందరగోళం సృష్టిస్తూ సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Tags:    

Similar News