Viral Video: ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తారో.. బైక్‌పై కపుల్ రొమాన్స్ వీడియో
Couple Romantic video goes viral: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు ఎలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయో చెప్పలేని పరిస్థితి ఉంది. లైక్స్, వ్యూస్ కోసం కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా కపుల్స్‌కి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ వీడియో చూసిన వారు తిట్టి పోస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందనేగా మీ సందేహం. అయతే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఇటీవల జంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చుట్టూ ఎవరున్నారన్న విషయాన్ని మార్చిపోతున్నారో లేదా వైరల్ అవ్వాలంటే అలాగే చేయాలని అనుకుంటున్నారో ఏమో కానీ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. నలుగురి మధ్య హద్దులుమీరి ప్రవరిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువ జంట బైక్ ఎక్కి నానా హంగామా చేసింది.
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేసింది. బైక్ ట్యాంకర్‌పై కూర్చున్న యువతి, యువకుడితో రొమాన్స్ చేస్తోంది. బైక్ డ్రైవ్ చేస్తూనే ఇలా రెచ్చిపోయారు. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో కాస్త నెట్టింట ట్రెండ్ అయ్యింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు స్పందిస్తూ పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. ఏది ఏమైనా లైక్స్ కోసం కొందరు చేస్తున్న పనులు చూస్తుంటే పిచ్చి పీక్స్‌కు చేరడం అంటే ఇదే అనిపిస్తోంది.