Optical Illusion: మీ కంటి పవర్‌కి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌, బ్రెయిన్‌ పజిల్‌, ఫొటో పజిల్‌.. ఏ పేరుతో పిలిచినా ఇలాంటి వాటికి ఉండే క్రేజే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2025-01-15 11:50 GMT

Optical Illusion: మీ కంటి పవర్‌కి ఓ టెస్ట్‌.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌, బ్రెయిన్‌ పజిల్‌, ఫొటో పజిల్‌.. ఏ పేరుతో పిలిచినా ఇలాంటి వాటికి ఉండే క్రేజే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నపెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇలాంటి వాటిని సాల్వ్‌ చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. అయితే ఒకప్పుడు కేవలం న్యూస్‌ పేపర్లు, మ్యాగజైన్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ ఫొటో పజిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతున్నాయి. ప్రతీ నిత్యం రకరకాల ఫొటో పజిల్స్‌ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇలాంటి ఫొటోలను పోస్ట్‌ చేసేందుకు కొందరు ప్రత్యేకంగా పేజీలను సైతం క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్‌ ఫొటో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఓ యువతి ఉలెన్‌తో ఏదో అల్లుతున్నట్లు కనిపిస్తోంది కదూ! అయితే అక్కడ తన పెంపుడు పిల్లులు కనిపిస్తుంటాయి.

కానీ ఆ పిల్లుల నడుమ ఒక కుక్క దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్‌ ముఖ్య ఉద్ధేశం. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ ఫొటో చూసిన 10 సెకండ్లలో పజిల్‌ను సాల్వ్‌ చేస్తే మీ కంటి పవర్‌తో పాటు ఆలోచన శక్తి సూపర్‌ అని చెప్పొచ్చు. ఇది మీ బ్రెయిన్‌ సామార్థ్యాన్ని కూడా టెస్ట్‌ చేస్తుంది.

చూశారా.? ఆ శునకాన్ని కనిపెట్టారా.? ఓ సారి ఫొటోను తీక్షణంగా చూస్తే ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడం పెద్ద విషయమేమి కాదు. ఎంత ట్రై చేసినా కుక్కను కనిపెట్టలేకపోతున్నారా.? అయితే ఓసారి ఆ యువతి తలపైన ఎడమ చేతివైపు గమనించండి. మీరు వెతుకుతోన్న కుక్క అక్కడే ఉంది. కనిపించిందా.? ఇంత క్లియర్‌గా చెప్పినా కనిపించలేదంటే ఓసారి సమాధానం కోసం కింది ఫొటోను చూసేయండి. 

Optical Illusion Photo


Tags:    

Similar News