Viral Video: నీళ్ల నుంచి నిప్పు పుడుతోంది.. చూసే కళ్లను మాయ చేస్తున్న వైరల్ వీడియో..!
Viral Video: ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవు ఈ సృష్టి. మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఈ సృష్టిలో జరుగుతుంటాయి.
Viral Video: ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవు ఈ సృష్టి. మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఈ సృష్టిలో జరుగుతుంటాయి. అయితే ఒకప్పుడు కేవలం కొందరికీ మాత్రమే తెలిసిన ఇలాంటి వింతలు ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరికీ అరచేతిలో వాలిపోతున్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి వింత సంఘటనలు జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
నీళ్లతో నిప్పు వెలిగిస్తూ కొందరు మ్యాజిక్ చేస్తుంటారు. అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియోలో మాత్రం నీళ్ల నుంచి మంట వస్తోంది. అయితే అదే నీటితో స్నానాలు కూడా చేస్తున్నారు. మధ్యప్రదేశ్ పంచమర్తి పరిధి పిపారియా అనే ప్రాంతలో ఈ అద్భుత సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి వచ్చే పర్యాటకులు బోరు నుంచి వస్తున్న నీటితో స్నానాలు చేస్తున్నారు. బోరు నుంచి నీరు ఉబికి వస్తోంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా ఆ నీటి నుంచి మంటలు వస్తున్నాయి.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బోరు నుంచి వస్తున్న నీటిలో న్యూస్ పేపర్లను పెడితే భగ్గుమని మండుతోంది. అయితే నీళ్లను చేతితో తాకితే మాత్రం ఏం కావడం లేదు. పేపర్ ముక్కకు మంట అంటుకోవడం వెనకాల ఉన్న లాజిక్ ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. దీంతో పర్యాటకులంతా ఇది చూసి షాక్ అవుతున్నారు. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు నీళ్లలో నుంచి మంటలు ఎలా వస్తున్నాయి అంటూ కొందరు స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇదేదో గ్రాఫిక్ మాయాజాలంగా కనిపిస్తోంది అంటూ స్పందిస్తున్నారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాను మాత్రం షేక్ చేస్తోంది. మరి ఈ థ్రిల్లింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.