ఇంటర్ ఫలితాలపై సందేహాలున్నాయా.. అయితే ఇలా క్లియర్ చేసుకోండి..
తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ బోర్డు ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్ బోర్డు ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది విడుదలయిన ఇంటర్ ఫలితాల విషయంలో ఎన్నో అవకతవకలు ఏర్పడి బోర్డు తీరు వివాదాస్పదమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు రాకుండా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) పలు జాగ్రత్తలు తీసుకుంది. పేపర్ వ్యాలుయేషన్ దగ్గర నుంచి ఫలితాలను విడుదల చేసేవరకు అన్నీ విషయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకుని, ఫలితాలను మరోసారి పక్కాగా సరిచూసుకున్న తర్వాతనే ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. అయినా విద్యార్ధులకు ఎవరికైనా ఫలితాల విషయంలో సందేహాలు, సమస్యలు ఉంటే వెంటనే వారు అధికారులను సంప్రదించే అవకాశాన్ని కల్పించారు.
విద్యార్థులు ఫలితాల్లో అవకతవకలు కానీ, ఫలితాల విషయంలో సమస్యలు కానీ ఉంటే వాటిని తెలుసుకోవడానికి టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియర్ ఎడ్యుకేషన్ గ్రీవియెన్స్ రిడ్రసల్ సిస్టమ్ (BIGRS) ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ BIGRS ఆండ్రాయిడ్ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో కూడా ఉంచారు. ఈ యాప్ ద్వారా ఇంటర్ ఫలితాలపై ఉన్న సందేహాలను, అనుమానాల గురించి ఫిర్యాదు చేయవచ్చు.
అంతే కాదు http://bigrs.telangana.gov.in/ పేరుతో వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా కూడా విద్యార్దులు ఫలితాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా విద్యార్ధులు ఈ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ సమస్యను వివరించేందుకు Raise Grievances పైన్ క్లిక్ చేయాలి. అక్కడ మీకు రిజల్ట్ విషయంలో ఎవలాంటి సమస్య ఉందో వివరంగా రాయాలి. అలా పంపిన వెంటనే ఇంటర్ బోర్డు అధికారులకు మీ ఫిర్యాదు చేరుతుంది. కొద్ది నిమిషాల తరువాత మీ సమస్య పరిష్కారమైందో లేదో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలపై సందేహాలు ఉన్న విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫలితాలలో అవకతవకలు ఉంటే వెంటే వెంటనే ఈ ప్రొసీజర్ ను ఫాలో అవ్వండి.