Raithu Bharosa: ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ ఎదుట ‘రైతు భరోసా’ పోస్టర్ల కలకలం
Rythu Bharosa: ఢిల్లీ లో ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపాయి.
Rythu Bharosa: ఢిల్లీ లో ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం.. ఇటీవల సీఎం రేవంత్ యూటర్న తీసుకుంటూ ఎకరాకు 15 వేలు ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసీసీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. అయితే.. వీటిని ఎవరు ఇక్కడ అంటించారో తెలియరాలేదు.