Sankranti Holidays 2025: విద్యార్థులకు గుడ్ న్యూస్..సంక్రాంతికి వారం రోజులు సెలువులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే?
Sankranti Holidays 2025: ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. కొత్త ఏడాదిలో మొదటగా వచ్చే సంక్రాంతి పండగకు సంబంధించి ప్రభుత్వం సెలవులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. 2024-25 సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాల క్యాలెండర్ ప్రకారం జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. సంక్రాంతి దృష్ట్యా ఈ ఐదు రోజులపాటు సెలవులు క్రిస్మస్ సెలవులకు ముందేగానే అనుమతించారు.
అయితే విద్యార్థులు రెండు రోజల ముందు నుంచే తమ సంక్రాంతి సెలవులు ఆనందించవచ్చు. ఎందుకంటే 13 నుంచి ప్రభుత్వం అధికారికంగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. దానికి ముందు రెండు రోజులు అంటే 11 రెండో శనివారం 12వ తేదీ ఆదివారం కావడంతో విద్యార్థులకు ఈ సెలవులు అదనంగా వచ్చాయి.
ఫార్మెటివ్ అసెస్ మెంట్ పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ఈ సెలవుల సమయం కూడా విద్యార్థులకు పరీక్షలు ప్రిపేర్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. 10వ తరగతి విద్యార్థులకు జనవరి 29లోగా పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం. అయితే 1 నుంచి 9వ తరతగుల విద్యార్థులు తమ సంబంధిత పరీక్షలను 28 ఫిబ్రవరిలోపు రాయాల్సి ఉంటుంది.
ఇంటర్ విద్యార్థులకు కూడా తమ సంక్రాంతి సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే తెలంగాణ ఇంటర్ విద్యామండలి అధికారికంగా సెలవుల తేదీలను ప్రకటించాల్సి ఉంది.
అటు ఏపీ సర్కార్ కూడా సంక్రాంతి సెలవులపై అధికారికంగా స్పష్టత ఇచ్చింది. 2024-25 విద్య సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు పాటించనున్నట్లు SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు.
కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా ముందుగా మూసివేసిన కారణంగా సెలవులు జనవరి 11 -15 లేదా జనవరి 12-16 వరకు పరిమితం చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. అధికారిక సెలవుల షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని పునరుద్ఘాటిస్తూ ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మకూడదని కృష్ణా రెడ్డి ప్రజలను కోరారు.