Inter Board Secretary Syed Umar Jalil: ఇంటర్ ఫలితాలు ప్రచారం చేసిన కాలేజీలకు షోకాజ్..
Inter Board Secretary Syed Umar Jalil: ఇంటర్ ఫలితాలు వచ్చాయంటే చాలు కార్పోరేట్ కళాశాల యాజమాన్యాలు తమ విద్యార్ధులే ర్యాంకులు సాధించారంటూ ప్రటలన జోరు చూపిస్తారు.
Inter Board Secretary Syed Umar Jalil: ఇంటర్ ఫలితాలు వచ్చాయంటే చాలు కార్పోరేట్ కళాశాల యాజమాన్యాలు తమ విద్యార్ధులే ర్యాంకులు సాధించారంటూ ప్రటలన జోరు చూపిస్తారు. టీవీల్లో, పత్రికల్లో ఇలా ఎక్కడ చూసినా అవే ప్రాచారాలు కనిపిస్తుంటాయి. ర్యాంకులను, మార్కులను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తూ ప్రవేశాల కోసం విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. అలాంటి కళాశాలలపై ఈ ఏడాది ఇంటర్ బోర్డు కొరడా ఘలిపించింది. ఇంటర్మీడియట్ ఫలితాలను టీవీలు, పత్రికల్లో ప్రచారం చేస్తున్న కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశించారు.
నిబంధనలను అతిక్రమించి తమ కాలేజీ విద్యార్థులే పట్టణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి టాపర్లుగా, ర్యాంకర్లుగా పేర్కొంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేసే యాజామాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి చాలా ప్రకటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇదీ బోర్డు నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. ప్రచారం చేసిన ఇంటర్ కళశాలలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారికి కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని పేర్కొన్నారు.