Etela Rajender Video Conference with Hospital Superintendent: గాంధీ ఆసుపత్రి నర్సులు పేషెంట్లకు అన్నం తినిపిస్తున్నారు
Etela Rajender Video Conference with Hospital Superintendent: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Etela Rajender Video Conference with Hospital Superintendent: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ లతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అవసరాలు, సమస్యలపై చర్చించారు. జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల్లో - తక్కువ లక్షణాలున్న వారందరికీ చికిత్స అందించాలని సూచించారు. కరోనా పాజిటివ్గ గా నిర్ధారణ అయి లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐశొలేషన్ లో ఉంచాలి అని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఏ కొరత ఉండకుండా చూడాలని.
వైద్యానికి అవసరమయ్యే ఏ పరికరాలు కోరినా అది ఒక్క రోజులో అందిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని తెలిపారు. అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరమని అన్నారు. ఈ సేవ మీకు పుణ్యం అందిస్తుందన్నారు. మహబూబ్ నగర్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి క్వార్టర్స్ లోనే ఉండి అందుబాటులో ఉంటున్నందుకు ఆయన్ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అన్నీ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు కూడా జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, కోవిడ్ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రవణ్, గాంధీ ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ రాజారావు ఉన్నారు.