Kite Festival 2025: కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Kite Festival 2025: సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండివంటలు, ముగ్గులు, పతంగులు.

Update: 2025-01-13 06:52 GMT

Kite Festival 2025: కైట్స్ ఫెస్టివల్ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Kite Festival 2025: సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిండివంటలు, ముగ్గులు, పతంగులు. సంక్రాంతి సందర్భంగా మహిళలు ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తుంటే.. మగవారు, పిల్లలు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు హైదరాబాద్‌లో పతంగుల సందడి మొదలైంది. ఇప్పటికే నగరంలో పలుచోట్ల కైట్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరగనుంది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ ప్రారంభమవగా.. దాదాపు 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్‌ ప్రొఫెసనల్ కైట్ ప్లెయర్స్ ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. అలాగే 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్‌లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లెయర్స్ పాల్గొంటారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కైట్ ఫెస్టివల్ జరగనుంది. 

Tags:    

Similar News