జనవరి నెలాఖరుకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా: తప్పుడు సమాచారమిస్తే చర్యలు
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు జరిగినా, పొరపాటున తప్పుడు సమాచారం ఎంటర్ చేశారా అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు జరిగినా, పొరపాటున తప్పుడు సమాచారం ఎంటర్ చేశారా అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది. క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలన కింద దరఖాస్తులు స్వీకరించారు. మరో వైపు ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్రంలో 80 ,54,554 లక్షల దరఖాస్తులు అందాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు జల్లెడపడుతున్నారు. 68, 57, 216 మంది దరఖాస్తులను అధికారులు యాప్ ద్వారా సేకరించారు.
సర్వే పూర్తైన దరఖాస్తులను మరోసారి చెక్ చేయనున్నారు. 4 లక్షల ధరకాస్తులను హౌసింగ్ శాఖ అధికారులు సంబంధిత మండలాలకు, మున్సిపల్ అధికారులకు పంపారు. ఈ ధరకాస్తు దారుల ఇళ్లకు వెళ్లి నేరుగా దరఖాస్తులను క్రాస్ చెక్ చేయనున్నారు. ఇందిరమ్మ యాప్ లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా.. తప్పుడు సమాచారం ఇచ్చారా అనే విషయాలను పరిశీలిస్తారు. తప్పుడు సమాచారం నమోదైతే అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారు.
గ్రామ సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తారు. జనవరి 10న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయానికి ఉపయోగమైన భూముల వివరాలను గ్రామసభల్లో ప్రకటించాలని కోరారు. ఇందిరమ్మ కమిటీలు లబ్దిదారులను ఎంపిక చేస్తాయి. జిల్లా ఇంచార్జీ మంత్రులు ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం తెలిపారు. జనవరి నెలాఖరుకు లబ్దిదారుల జాబితాను ప్రకటించనున్నారు.