TS Government: బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే వారందరికీ ఇండ్లు?

Update: 2025-01-11 02:51 GMT

TS Government: బిగ్ గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే వారందరికీ ఇండ్లు?

TS Government: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసి ప్రజలకు శుభవార్త చెప్పారు. కొమురం భీమ్ జయంతిని అధికారికంగా స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు. శుక్రవారం ఆదివాసీ నాయకులతో ప్రత్యేకంగా సచివాలయంలో జరిగిన సమావేశంలో.. రవాణా, తాగునీరు సరఫరా, సాగు, కేసులు, విద్య, ఆర్థిక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.

ప్రతి నాలుగు నెలలకోసారి ఆదివాసీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివాసులపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేస్తామని సీఎం తెలిపారు. 100% ఓనర్ షిప్స్ స్కాలర్షిప్స్ ను ఆదివాసి విద్యార్థులకు మంజూరు చేయాలని సీఎం ప్రకటించారు. గోండి భాషలో ప్రాథమిక విద్యను బోధించేందుకు సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. అటు ఆదివాసి రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు .

కాగా ఆదివాసీ నాయకులతో జరిగిన సమావేశంలో ప్రజలు తమ ప్రాంతీయ సమస్యల గురించి సీఎంకు వివరించారు. సీఎం అన్ని సమస్యలను విచారించి వెంటనే పరిష్కారాలు అందించారు. కొన్ని ఇతర సమస్యలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదివాసి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు.

జనాభా ప్రాతిపదికన ఆదివాసి ప్రజలకు ఇల్లు మంజూరు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివాసి రైతుల కోసం ఫ్రీ సోలార్ పంపు సెట్లు పంపిణీ చేస్తామన్నారు. తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ . కేస్లాపూర్ జాతరకి నిధులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసి రాయి సెంటర్ నిర్మాణానికి అవసరమైన భవనాలు, ప్రభుత్వ స్థలాలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సొక్కు, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ ఇతర ఆదివాసి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News