Road Accident: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

Road Accident: హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది.

Update: 2025-01-10 05:36 GMT

Road Accident: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. నలుగురు మృతి

Road Accident: హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో.. ఆగి ఉన్న ఇసుక లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉండగా... నలుగురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సహాయక చర్యలు చేపట్టారు.

బాధితులంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. వీరు కూలీలు పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. క్షతగాత్రుల్లో పలువురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News