Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్‌ రెడ్డి

Formula E Race Case: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది.

Update: 2025-01-10 05:42 GMT

Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్ఎన్‌ రెడ్డి

Formula E Race Case: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న HMDA మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు (Tealangana News) హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ అగ్రిమెంట్‌ జరిగిన విధి విధానాలతో పాటు రేస్‌ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు HMDA ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించారు. అలాగే.. విడుదలైన నిధులు ఏ ప్రతిపాదికన జరిగాయనే కోణాల్లో ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

Tags:    

Similar News