కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ చేశారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు

Update: 2025-01-10 13:49 GMT

కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం కేసు నమోదైంది. అనుమతి లేకుండా ర్యాలీ చేశారని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫార్మూలా ఈ కారు రేసు కేసులో జనవరి 9న కేటీఆర్ ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. విచారణ పూర్తైన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్లారు. అయితే ఈ సమయంలో కేటీఆర్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడే సమయంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని పోలీసులు కేటీఆర్ మీడియాతో మాట్లాడే సమయంలో పోలీసులు చెప్పారు. ఈ సమయంలో కేటీఆర్ పోలీసుల తీరును తప్పుబట్టారు. మీడియాతో మాట్లాడితే ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించారు. అర్ధాంతరంగా మీడియా సమావేశం ముగించిన ఆయన బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లిపోయారు.

ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయనేది ప్రభుత్వ వాదన. అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో ఎఫ్ఈఓకు నిధులు చెల్లించారని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఫిర్యాదు మేరకు 2024 డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. డిసెంబర్ 20న ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 16న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ , హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిల పేర్లను కూడా దర్యాప్తు సంస్థలు చేర్చాయి. వీరిద్దరిని దర్యాప్తు సంస్థలు విచారించాయి.   

Tags:    

Similar News