Sankranthi Gift: తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుక..ఒక్కొక్కరి ఖాతాల్లో రూ. 12000 జమ?

Update: 2025-01-12 02:34 GMT

Sankranthi Gift: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరుపేదలను గుర్తించి వారికి సహాయం అందించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం మాత్రమే అందిస్తామని ఇకపై బియ్యం అమ్మకానికి అవకాశం ఉండదని మంత్రం స్పష్టం చేశారు.

ఇళ్లకు అర్హులైన వారిని గుర్తించి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సూచించారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీం కేవలం నిరుపేదలకు అందుతుందని.. ఈ నెల 26న సంక్రాంతి సందర్భంగా ఆ స్కీమ్ కింద రూ. 12వేలు అందజేస్తామని మంత్రి తెలిపారు. తప్పుడు లెక్కలు నమోదు చేస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

అయితే ఈ మొత్తం ఒకే విడతలో ఖాతాలో జమ చేస్తారా? లేదా రెండు విడతల్లో జమ చేస్తారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. ప్రజల భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. రోడ్డు మార్గాలు, విద్యా ,వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ప్రభుత్వ స్కీములలో ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అంతా చురుకుగా పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం, విద్యుత్, మౌలిక సదుపాయాల వసతుల కల్పన కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.  

Tags:    

Similar News