Padi Kaushik Reddy: ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కొట్టిన పాడి... అసలేం జరిగిందంటే...
Padi Kaushik Reddy beats Jagtial MLA Sanjay Kumar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై చేయి చేసుకున్నారు. కరీంనగర్ జడ్పీ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఏ పార్టీలో ఉన్నావ్ అంటూ పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
సంజయ్ కుమార్ పై దాడి అనంతరం పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు. బయటికి వెళ్లే క్రమంలోనూ ఆయన సంజయ్ కుమార్‌పై అసభ్యపదజాలంతో వ్యాఖ్యలు చేసుకుంటూనే వెళ్లారు. అమ్ముడుపోయిన ... .... లకు కూడా మాట్లాడాల్సిందిగా మైక్ ఇస్తారంటూ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.