Danam Nagender: దానం నాగేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారా? స్పందించిన దానం
Danam Nagender about KTR formula E Race case: ఫార్ములా ఈ రేస్ కేసులో తాను కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోందని, కానీ అందులో వాస్తవం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అయినా కేటీఆర్‌కు క్లీన్ చిట్ ఇవ్వడానికి తానేమీ అడ్వకేట్ కాదని అన్నారు. కేటీఆర్ మీద వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిందిగా మీడియా అడిగిందని, అయితే, ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసు వివాదం కోర్టు విచారణలో ఉన్నందున దానిపై ఇప్పుడే స్పందించాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానన్నారు. అలాగే ఫార్ములా ఈ రేస్ వల్ల నగరం ఖ్యాతి పెరుగుతుందని మాత్రమే చెప్పాను కానీ కేటీఆర్‌ను తాను సమర్ధించలేదని దానం నాగేందర్ వివరణ ఇచ్చారు.
ఎప్పుడైతే క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపణలు వచ్చాయో... అప్పుడే సంబంధిత దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ చేపడతాయని దానం అన్నారు. కేటీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోందన్నారు.