Padi Kaushik Reddy: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్న ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే...

Padi Kaushik Reddy: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్న ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారంటే...

Update: 2025-01-12 16:30 GMT

Padi Kaushik Reddy beats MLA Sanjay Kumar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన పై తాజాగా పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దయవల్ల బీఆర్ఎస్ టికెట్ పై ఎంఎల్ఏ గా గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఒక్క సంజయ్ కుమార్ నే కాదు... బీఆర్ ఎస్ టిక్కెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ ఒక్క ఎమ్మెల్యే ను తాము ప్రశ్నిస్తాం... ఇలానే నిలదీస్తాం అని అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం.

Full View

ఆదివారం మధ్యాహ్నం తర్వాత కరీంనగర్ జడ్పీ సమీక్షా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెడ్పీ సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ముందు మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ సంజయ్ కుమార్ ని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లి సంజయ్ కుమార్ పై చేయి చేసుకున్నారు. 

Tags:    

Similar News