కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్టు.. భారీగా మోహరించిన పోలీసులు
BRS Leaders House Arrest: తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
BRS Leaders House Arrest: తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఆందోళనలకు దిగే అవకాశాలు ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసకుంటున్నారు. కోకాపేట్‌లో హరీష్‌రావును నిర్బంధించిన పోలీసులు.. గచ్చిబౌలిలోని ఇంటిదగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్బంధించారు. వారి నివాసాల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు కోర్టుకు తరలించారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు చేసి ఆయన్ను.. రెండవ అదనపు జూనియర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేతో ఘర్షణ కేసులో కౌశిక్ రెడ్డిని నిన్న అదుపులోకి తీసుకున్నారు కరీంనగర్ పోలీసులు. ఆయన్ను రిమాండ్‌కు కోరే అవకాశాలు కనిపిస్తుండగా.. మెజిస్ట్రేట్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.