ఏప్రిల్ 2 లేదా మూడు తేదీల్లో రేవంత్ మంత్రివర్గ విస్తరణ: గవర్నర్ కు సమాచారం?
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 2 లేదా మూడు తేదీల్లో ఉండే అవకాశం ఉంది.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ 2 లేదా మూడు తేదీల్లో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేవంత్ రెడ్డి మార్చి 30న రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు.
మంత్రివర్త విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణకు రేవంత్ రెడ్డి సన్నాహలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గత ఏడాది మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు ఇటీవలే దిల్లీకి వెళ్లారు.
కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు జరిపారు. పీసీసీ కార్యవర్గం కూర్పుతో పాటు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించారు. మంత్రివర్గంలో చోటు దక్కనివారికి పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. దీనికి తోడు నామినేటేడ్ పదవులను కూడా భర్తి చేయనున్నారు.మంత్రివర్గంలోకి ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. కానీ, ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు.