Telangana Ration: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం

Update: 2025-04-03 03:25 GMT
Telangana Ration: మీకు రేషన్  కార్డు ఉందా.. అయితే మీకు త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana Ration: మీకు రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు త్వరలోనే భారీ గుడ్ న్యూస్ చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం

  • whatsapp icon

Telangana Ration: మీకు రేషన్ కార్డు ఉందా. అయితే మీకు త్వరలోనే ఓ భారీ శుభవార్త వినిపించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అభయహస్తం రేషన్ కిట్ పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉందని తెలిపింది. దీనిలో భాగంగా ఒక్క కిట్ లో 9 నిత్యావసర సరుకులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ లో సన్న బియ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..నిత్యవసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిపింది. త్వరలోనే రేషన్ షాపుల్లో వీటిని ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం అని పేరు పెడుతున్నట్లు సమాచారం.

అధికారిక జాబితా ఇంకా విడుదల చేయనప్పటికీ సమాచారం ప్రకారం ఈ కిట్ లో 9 వస్తువులు ఉండే అవకాశం ఉంది.

సన్న బియ్యం (6 కిలోలు)

కందిపప్పు (1 కిలో),

గోధుమ పిండి (1 కిలో),

చక్కెర (అర కిలో),

నూనె (1 లీటర్),

చింతపండు (అర కిలో),

ఉప్పు (1 కిలో),

కారం పొడి (250 గ్రాములు),

పసుపు (100 గ్రాములు)

అయితే లబ్దిదారులు.. ఈ కిట్‌లో తమకు ఏమేం కావాలో అవి తీసుకోవచ్చు. అన్నీ కూడా తీసుకోవచ్చు.

ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది?:

ప్రభుత్వం ఇచ్చే కిట్ ఇదే విధంగా ఉంటే.. ఒక వ్యక్తి ఈ వస్తువుల్ని బయట మార్కెట్‌లో కొనకుండా.. రేషన్ షాపులో కొనుక్కుంటే, ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది చూస్తే...

ఈ రేషన్ కిట్‌లోని వస్తువుల మార్కెట్ విలువను లెక్కిస్తే:

సన్న బియ్యం (6 కిలోలు) - ₹50/కిలో = ₹300

కందిపప్పు (1 కిలో) - ₹150/కిలో = ₹150

గోధుమ పిండి (1 కిలో) - ₹40/కిలో = ₹40

చక్కెర (అర కిలో) - ₹45/కిలో = ₹45

పామాయిల్ (1 లీటర్) - ₹150/లీటర్ = ₹150

చింతపండు (అర కిలో) - ₹90 = ₹90

ఉప్పు (1 కిలో) - ₹20/కిలో = ₹20

కారం పొడి (250 గ్రాములు) - ₹60 = ₹60

పసుపు (100 గ్రాములు) - ₹30 = ₹30

మొత్తం మార్కెట్ విలువ: ₹885

ఒక వ్యక్తి ఈ కిట్‌ను ఉచితంగా లేదా సబ్సిడీ రేట్ (ఉదాహరణకు ₹100)లో పొందితే, అతనికి నెలకు ₹785 వరకూ ఆదా అవుతుంది.

Tags:    

Similar News