Telangana: నేడు బీఆర్ఎస్ బాహుమలి బహిరంగ సభ.. దారులన్నీ ఓరుగల్లు వైపే

Update: 2025-04-27 00:52 GMT
Telangana: నేడు బీఆర్ఎస్  బాహుమలి బహిరంగ సభ.. దారులన్నీ ఓరుగల్లు వైపే
  • whatsapp icon

Telangana: బీఆర్ఎస్ నేతలు 16 నెలల తర్వాత యాక్టివ్ అయ్యారు. గులాబీనేతలు ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. 25ఏళ్ల పండగకు ఊరువాడను కదలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది వరకు ఒక లెక్క...ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా వరంగల్ సభను మారుమ్రోగించేందుకు సిద్ధమయ్యారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామని చెబుతున్నారు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్ కు పయనమవుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా కూడా గులాబీ మయంగా మారిపోయింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్తరూపును సంతరించుకుంది. సభకు 10లక్షల మందిని తరలిస్తున్నామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. బీఆర్ ఎస్ కు కలిసివచ్చిన వరంగల్ లో నిర్వహిస్తూన్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర క్రియేట్ చేస్తామని చెబుతున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ సభపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వరంగల్ కు బీఆర్ఎస్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ సభకు ఎంత ఖర్చు పెట్టుకుంటామన్నది తమ ఇష్టమని చెబుతున్నారు. బీఆర్ఎస్ సభకు వచ్చేవారు జాగ్రత్తగా రావాలని..రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని హరీష్ రావు సూచించారు. 

Tags:    

Similar News