బట్టతలపై వెంట్రుకల ఆశకు క్యూ కట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్

Hair growth on bald head:బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ఆయిల్, లోషన్ విక్రయించే పేరుతో వేలకు వేలకు దండుకుని మోసం...

Update: 2025-04-23 15:42 GMT
బట్టతలపై వెంట్రుకల ఆశకు క్యూ కట్టిన జనం.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్
  • whatsapp icon

Hair growth on bald head: బట్ట తలపై వెంట్రుకలు మొలిపిస్తామని హరీష్ అనే వ్యక్తి చెప్పిన మాటలను నమ్మిన బట్టతల బాధితులు ఉప్పల్ బగాయత్‌లో క్యూ కట్టారు. రూ. 1000 కే బట్టతలపై వెంట్రుకలు మొలుస్తాయనే ప్రకటన చూసిన జనం వేలాదిగా నిర్వాహకుల శిబిరానికి తరలివచ్చారు. వచ్చిన వారి నుండి ఎంట్రీ ఫీజు కింద రూ. 300 , నిర్వాహకులు ఇచ్చే ఆయిల్ కోసం మరో రూ. 700 వసూలు చేశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వాహకులు హరీష్, రాజశేఖర్, వినోద్‌లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బట్టతలపై వెంట్రుకలు మొలిపించే ఆయిల్, లోషన్ విక్రయించే పేరుతో వేలకు వేలకు దండుకుని మోసం చేస్తున్నారని పోలీసులు చెప్పడంతో షాక్ అవడం బాధితుల వంతయ్యింది.

ఇటీవల పాత బస్తీలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుండి వచ్చిన సలీం అనే వ్యక్తి లాల్ దర్వాజలో సెలూన్ నిర్వహిస్తున్నాడు. తన వద్ద బట్టతలపై వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడే ఔషదం చెప్పి అందరినీ నమ్మించాడు. దాంతో వందల సంఖ్యలో జనం పోగయ్యారు. వారికి ముందుగా గుండు చేసిన సలీం, ఆ తరువాత తను చెప్పిన లోషన్ గుండుపై పూశాడు. 3 రోజుల వరకు గుండుపై షాంపూ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేయొద్దని చెప్పాడు. పొరపాటున అలా చేస్తే ఔషదం పనిచేయదని నమ్మించాడు.

సలీం వద్ద లోషన్ తీసుకున్న వాళ్లకు మరునాడు తలనొప్పి రావడం, ఎలర్జీ రావడం వంటి సమస్యలు తలెత్తాయి. దాంతో వారు ఆస్పత్రులకు పరుగెత్తాల్సిన దుస్థితి తలెత్తింది. అలా అనారోగ్య సమస్యలు ఎదుర్కున్న వాళ్లు సలీంను వెదుక్కుంటూ వెళ్లినప్పటికీ అప్పటికే అతడు దుకాణం మూసేసి ఉడాయించాడు. ఈ విషయం తెలియని వారు మరోసారి ఉప్పల్ లోనూ అలాంటి వ్యక్తుల వల్లో పడి మోసపోయారు. కానీ పోలీసులు వెంటనే స్పందించడంతో ఈ ఘటనలో మోసానికి పాల్పడిన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. 

Tags:    

Similar News