Asaduddin: పహల్గామ్‌ ఉగ్రదాడిపై అసదుద్దీన్ అలా అన్నారేందుకు? పాకిస్తాన్ తప్పేలేదా?

Update: 2025-04-24 02:14 GMT
Asaduddin: పహల్గామ్‌ ఉగ్రదాడిపై అసదుద్దీన్ అలా అన్నారేందుకు? పాకిస్తాన్ తప్పేలేదా?
  • whatsapp icon

Asaduddin Owaisi condemned the Pahalgam

Asaduddin: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ఊచకోతగా అభివర్ణిస్తూ..నిఘా వైఫల్యమే దీనికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన పుల్వామా ఉగ్రదాడి కంటే అత్యంత ప్రమాదకరమైంది అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ ఘటనపై జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పహల్గామ్ లో ఉగ్రవాదులు మతం అడిగి అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపేశారు. ఈ దాడిని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అమాయకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి.నిఘా వైఫల్యం ఈ దాడికి కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులందరికీ ప్రభుత్వం గుణపాఠం నేర్పాలి. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక విదేశీ పర్యాటకుడు కూడా ఈ దాడిలో మరణించడం అత్యంత బాధాకరమని..భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

అసలు పాకిస్తాన్ ని అసదుద్దీన్ తప్పుపట్టకపోవడం విచారకరం. ఉగ్రవాదులు వచ్చింది పాకిస్తాన్ నుంచి అన్న విషయం అందరికీ తెలుసు. సరిహద్దుల్లో ఉగ్రవాదులను పాక్ ఆర్మీ పెంచి పోషిస్తుందని కూడా అందరికీ తెలుసు. ఇది వరకు ముంబై దాడులు, హైదరాబాద్ మక్కా మసీద్ దాడులు, లుంబినీ పార్క్ దాడులు వీటన్నింటి వెనకాల పాకిస్తాన్ ఉందని తెలుసు. అయినా కూడా అసదుద్దీన్ మన నిఘా వైఫల్యం అంటున్నారే తప్పా..పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని అనకపోవడం బాధాకరమని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు పాకిస్తాన్ కు కలిసి వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. కనీసం ఇలాంటి ఘటన జరిగినప్పుడు అయినా రాజకీయాలు పక్కన పెట్టడం మంచిదంటున్నారు. 

Tags:    

Similar News