KCR Speech: కాంగ్రెస్ పార్టీకి ఏం మాయ రోగమొచ్చింది? వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సర్కారుపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు

Update: 2025-04-27 14:13 GMT
KCR Speech: కాంగ్రెస్ పార్టీకి ఏం మాయ రోగమొచ్చింది? వరంగల్ సభలో రేవంత్ రెడ్డి సర్కారుపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు
  • whatsapp icon

KCR Speech in Warangal meeting: "స్వరాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీని, జండాను చూసి ఆనాడు అవమానించారు. కానీ వారి అవమానాలను లెక్కచేయకుండా పోరాడి తెలంగాణను సాధించుకున్నాం. ఆనాడు కాంగ్రెస్ లో టీడీపీలో ఉన్న వారు తెలంగాణ కోసం పెదవి విప్పలేదు.చంద్రబాబు ఆ రోజుల్లో సభలో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారు. తెలంగాణ అని పలికితే తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే వ్యవహరించింది. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు పెద్ద విలన్ కాంగ్రెస్ పార్టీనే" అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఆనాడు హైదరాబాద్ పేరుతో ఉన్నప్పుడు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలాన్ని గుర్తించి తెలంగాణ ఇస్తామని నమ్మించి తమ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కానీ తెలంగాణ ఇవ్వకుండా 14 ఏళ్లు సతాయించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ జయ శంకర్ తో కలిసి దేశంలోని మిగతా పార్టీలను ఒప్పించి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

గతంలో ఏ పార్టీ ఆలోచించని విధంగా ఆలోచించి, ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే రైతు బంధు పథకం ఆరంభించాం. ఎన్నో పథకాలు ఎవ్వరూ అడగకుండానే, ఎన్నికల హామీల్లో చెప్పకుండానే ప్రజల సంక్షేమం కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ ఇవాళ పరిస్థితి అలా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదినర్థమైంది. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం మాయ రోగమొచ్చింది? ఎందుకు ఆ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రేవంత్ రెడ్డి సర్కారుపై కేసీఆర్ విమర్శలు ఎక్కుపెట్టారు.

Full View

Tags:    

Similar News